ప్రత్యేక కోర్టుల ప్రారంభం వాయిదా
ABN , First Publish Date - 2022-03-05T07:47:38+05:30 IST
తిరుపతి రాయలచెరువురోడ్డులోని తుడా షాపింగ్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఎర్రచందనం ప్రత్యేక జుడీషియల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్, అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్సు కోర్టుల ప్రారంభ తేదీ వాయిదా పడింది.
తిరుపతి(లీగల్), మార్చి 4: తిరుపతి రాయలచెరువురోడ్డులోని తుడా షాపింగ్ కాంప్లెక్స్ మూడో అంతస్తులో ఏర్పాటు చేసిన ఎర్రచందనం ప్రత్యేక జుడీషియల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్, అడిషినల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్సు కోర్టుల ప్రారంభ తేదీ వాయిదా పడింది. ఈ కోర్టులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ శనివారం ప్రారంభించాల్సి ఉండగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పుల కారణంగా ఈ కార్యక్రమం రద్దయ్యింది. తదుపరి ప్రారంభ తేదీ వివరాలను అధికారులు తెలియపరచాల్సి ఉంది. ఈ విషయాన్ని తిరుపతి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.దినకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.