ఎర్రచందనం డంప్‌ను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-09-30T05:33:28+05:30 IST

ఎర్రచందనం దుంగలను డంప్‌ చేసిన గోడౌన్‌పై గురువారం చిత్తూరు తాలూకా పోలీసులు దాడి చేశారు.

ఎర్రచందనం డంప్‌ను పట్టుకున్న పోలీసులు
ఎర్రచందనం దుంగలను లారీలో ఎక్కిస్తున్న పోలీసులు

చిత్తూరు/గంగాధరనెల్లూరు, సెప్టెంబరు 29: ఎర్రచందనం దుంగలను డంప్‌ చేసిన గోడౌన్‌పై గురువారం చిత్తూరు తాలూకా పోలీసులు దాడి చేశారు. కొంతకాలంగా తిరుపతి శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను తీసుకొచ్చి జీడీ నెల్లూరు మండలం ఎన్టీయార్‌ కాలనీలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచారు. వీఐపీల సభలు, సమావేశాలు ఉన్నప్పుడు, పోలీసుల సంచారం లేని సమయాన్ని చూసి ఇక్కడ్నుంచి దుంగలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేవారు. కొంతకాలంగా ఇక్కడ నుంచి జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం అందింది. దాంతో గురువారం ఉదయం తాలూకా పోలీసులు పక్కా సమాచారంతో  ఎన్టీయార్‌ కాలనీలోని అడవి చివరన ఉన్న ఇంటిపై దాడి చేశారు. డంపులో ఉన్న దుంగలను లారీలో తీసుకొచ్చారు. పోలీసుల దాడి సమయంలో అక్కడున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు.. గిరింపేటలోని ఓ కారును సీజ్‌ చేసినట్లు సమాచారం. 

Read more