నాడు-నేడు రెండో విడతలో 1,121 పనులకు అనుమతి

ABN , First Publish Date - 2022-08-12T05:35:51+05:30 IST

నాడు-నేడు రెండో విడతలో జిల్లాలో 1,121 పనులకు అనుమతి లభించిందని, ఐదింటికి సాంకేతిక సమస్యలున్నాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

నాడు-నేడు రెండో విడతలో 1,121 పనులకు అనుమతి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 11: నాడు-నేడు రెండో విడతలో జిల్లాలో 1,121 పనులకు అనుమతి లభించిందని, ఐదింటికి సాంకేతిక సమస్యలున్నాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంపై వెలగపూడి నుంచి విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ మురళి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 414 పాఠశాలలకు రూ.17.97 కోట్లు రివాల్వింగ్‌ ఫండ్‌ మంజూరైందని చెప్పారు. 78 ప్రదేశాల్లో ఇసుక నిల్వలు చేశామని, మరో 554 పాఠశాలలకు అవసరమైన సిమెంటు కోసం అభ్యర్థన పంపామని అన్నారు. డీఈవో పురుషోత్తం, ఎస్‌ఎ్‌సఏ ఏపీసీ వెంకటరమణా రెడ్డి, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

276 సచివాలయ భవన నిర్మాణాలు పూర్తి

జిల్లావ్యాప్తంగా 525 గ్రామ సచివాలయాలుండగా, 276 భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. గురువారం పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇతర కార్యదర్శులతో వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ 37 మేజర్‌ గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇంతవరకు 59 ఆర్బీకేలకు బదులు 25, 357 వైఎస్సార్‌ హెల్త్‌క్లీనిక్‌లకు బదులు 82 భవన నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. బీఎంసీయూ, ఏఎంసీయూల నిర్మాణాలకు స్థల సేకరణ పూర్తయిందన్నారు. డ్వామా పీడీ చంద్రశేఖర్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌, డీపీవో లక్ష్మి పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-12T05:35:51+05:30 IST