స్వాతంత్య్ర దినోత్సవానికి పక్కా ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-08-14T06:04:03+05:30 IST
జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నగర్ పోలీసు పరేడ్ మైదానాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 13: జిల్లా కేంద్రంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయి. ప్రశాంత్ నగర్ పోలీసు పరేడ్ మైదానాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. స్టాల్స్, వివిధ శాఖల శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో పోలీసులు, విద్యార్థుల మార్చ్ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉష శ్రీచరణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన 500 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. ఏర్పాట్లను డీఆర్వో రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి శనివారం పరిశీలించి, పలు సూచనలు చేశారు. వీరివెంట ఆర్డీవో రేణుక, తహసీల్దార్ పార్వతి, ఐఅండ్పీఆర్ డీడీ పద్మజ ఉన్నారు.