Tiruchanoor: నేటినుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-11-20T10:07:00+05:30 IST

తిరుచానూరు (Tiruchanoor) పద్మావతి (Padmavati) అమ్మవారి (Ammavari) బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Tiruchanoor: నేటినుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా: తిరుచానూరు (Tiruchanoor) పద్మావతి (Padmavati) అమ్మవారి (Ammavari) బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి కార్తీక మాసంలో ఈ ఉత్సవాలను టీటీడీ (TTD) నిర్వహిస్తోంది. ఇప్పటికే శాస్త్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులపాటు జరగనున్నాయి. వివిధ వాహనాలపై పద్మావతి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాళ ధ్వజారోహణం, సాయంత్రం చిన్న శేష వాహన సేవ నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంతో ఉత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించింది. ఈ ఏడాది భక్తుల మధ్య పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-11-20T10:07:05+05:30 IST