విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తిమృతి

ABN , First Publish Date - 2022-07-01T05:26:18+05:30 IST

విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్యవేడు మండలంలో గురు వారం చోటు చేసుకుంది.

విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తిమృతి
సదమయ్య

సత్యవేడు, జూన్‌ 30: విద్యుత్‌ వైర్లు తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్యవేడు మండలంలో గురు వారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సత్యవేడులోని వాటర్‌ ట్యాంకు ఎస్టీ కాలనీకి చెందిన సదమయ్య (35) మధ్యాహ్నం ఇంటిపై ఆరబెట్టిన దుస్తులు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలు తగిలి షాక్‌కు గురై అపస్మారక స్థితిలో వెళ్లాడు.  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కొన్ని సంవత్సరాలుగా వాటర్‌ ట్యాంకు కాలనీలో ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్‌ తీగలను మార్చాలని ట్రాన్స్‌కో అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడంలేదని  స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్‌కో అధి కారుల నిర్లక్ష్యంతోనే నిండుప్రాణం బలైందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. Updated Date - 2022-07-01T05:26:18+05:30 IST