70 మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

ABN , First Publish Date - 2022-03-05T06:56:01+05:30 IST

ఇంటి పన్ను 50 శాతంకంటే తక్కువ చేసిన 70 మంది పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం షోకాజ్‌ నోటీసులిచ్చారు.

70 మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 4: ఇంటి పన్ను 50 శాతంకంటే తక్కువ చేసిన 70 మంది పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం షోకాజ్‌ నోటీసులిచ్చారు. మండలాలవారీగా.. శ్రీకాళహస్తిలో 31 మందికి, తొట్టెంబేడు, ఏర్పేడు మండలాల్లో 14 చొప్పున, తిరుపతిలో ఏడుగురు, రేణిగుంటలో ముగ్గురు, చంద్రగిరిలో ఒకరికి డీపీవో దశరథరామిరెడ్డి షోకాజ్‌ నోటీసులను జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వనివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.

Updated Date - 2022-03-05T06:56:01+05:30 IST