తూతూ మంత్రంగా తనిఖీలు

ABN , First Publish Date - 2022-06-24T06:30:09+05:30 IST

శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

తూతూ మంత్రంగా తనిఖీలు
ఆలయంలో బ్యాగులతో సంచరిస్తున్న భక్తులు

శ్రీకాళహస్తి, జూన్‌23: శ్రీకాళహస్తీశ్వరాలయంలో తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయంలో మూడు అంచెల భద్రతను పటిష్టం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహద్వారం కంచుగడప వద్ద లగేజీ బ్యాగులు, సెల్‌ఫోన్లను అనుమతించకుండా కట్టడి చేస్తుంటారు. ఇటీవల కొద్ది నెలలుగా కంచుగడప వద్ద తనిఖీల్లో అలసత్వం చోటుచేసుకుంటోంది. తరచూ భక్తులు లగేజీబ్యాగులు, సెల్‌ఫోన్లతో ఆలయం లోపలకు వెళుతున్నారు. బుధవారం రాత్రి ఓ భక్తుడు ఆలయంలో సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోతుండగా అర్చకులు గుర్తించి వారించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.  గురువారం కూడా ఆలయంలోకి భక్తులు తమ లగేజీ బ్యాగులను తీసుకెళుతూ కనిపించింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది.  

Updated Date - 2022-06-24T06:30:09+05:30 IST