కొత్త ఫోన్లు... ట్యాబ్‌లు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-08-18T05:10:11+05:30 IST

విధి నిర్వహణలో భాగంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అం గన్‌వాడీ వర్కర్లకు కొత్త సెల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అం దజేశారు.

కొత్త ఫోన్లు... ట్యాబ్‌లు ఇవ్వండి
సీడీపీవో రాజేశ్వరికి వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఐసీడీఎస్‌ కార్యాలయాల వద్ద అంగన్‌వాడీల ధర్నా


పలమనేరు, ఆగస్టు 17: విధి నిర్వహణలో భాగంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అం గన్‌వాడీ వర్కర్లకు కొత్త సెల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అం దజేశారు. గతంలో ఇచ్చిన సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు సక్రమంగా పని చేయడం లేదని, వాటిస్థానే కొత్తవి  ఇవ్వాలని  సీఐటీయూ నాయకుడు గిరి ధరగుప్తా ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు వినతి పత్రం అంద జేశారు. 15 రోజులలోపు కొత్త సెల్‌ ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వకపోతే పాతవాటిని కార్యాలయంలో అప్పగిస్తామని తెలిపారు. 

పుంగనూరు: తమ సమస్యలను ప్రభుత్వం వెం టనే పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. బుధవారం పుంగనూరు మున్సిపల్‌, మండల పరిధిలోని  అంగన్‌వాడీ కార్యకర్తలు పుంగనూరు సీడీపీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ కోసం రకరకాల యాప్‌లు డౌన్‌లోడ్‌, లబ్ధిదారులతో బయోమెట్రిక్‌ వేయించకపోతే  వేతనాల ను కట్‌ చేస్తామని బెదిరించడం భావ్యం కాద న్నారు. 2017లో నాశిరకమైన ఫోన్లు ఇచ్చారని,  ప్రస్తుతం ఆ ఫోన్లు 90శాతం పని చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. కొత్త ట్యాబ్‌లు, ఫోన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘనాయకులు పద్మ, బేబీరాణి, రెడ్డెమ్మ, శ్యామల పాల్గొన్నారు. 


Read more