-
-
Home » Andhra Pradesh » Chittoor » National development through education-NGTS-AndhraPradesh
-
విద్య ద్వారానే దేశాభివృద్ధి
ABN , First Publish Date - 2022-09-08T05:56:38+05:30 IST
విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సభ్యుడు టి.నరసింహ అన్నారు.

చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 7: విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ సభ్యుడు టి.నరసింహ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో అధికారులతో ఆయన సమావేశమ య్యారు. విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధన జరగాలని సూచించారు. ఇందుకు ఉపాధ్యాయులు తరగతులకు వెళ్లే ముందే సంబంధిత పాఠ్యాంశాలపై పూర్తి సన్నద్ధత కలిగి ఉండాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను, వాటి విశిష్టతను భావి తరాలకు తెలియజేసేలా బోధన చేయాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్, విద్యాశాఖ ఏడీ విజయానంద, డీఎస్పీ శ్రీనివాసమూర్తి, ఆర్టీవో రేణుక, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.