AP News.. చిత్తూరు: రైతు సదస్సు కార్యక్రమంలో నారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-28T20:36:53+05:30 IST

చిత్తూరు రైతు సదస్సు కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP News.. చిత్తూరు: రైతు సదస్సు కార్యక్రమంలో నారాయణ సంచలన వ్యాఖ్యలు

చిత్తూరు (Chittoor): నగరంలోని రైతు సదస్సు కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ (Narayana) సంచలన.. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజన్న పాలన తెస్తానని రాజన్న మాటకి సీఎం జగన్ (CM Jagan) పంగ నామాలు పెట్టారని దుయ్యబట్టారు. రైతు మోటర్లకు మీటర్లు బిగిస్తే బిగించేవాడి చేతులు నరకుతామన్నారు. తెలంగాణలో రైతు వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తే పగలగొడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అంటున్నారని, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి... నిజాం నవాబు వచ్చినట్టు మంది మార్బలంతో సామాన్య ప్రజానికాన్ని ఇంటి నుంచి బయటకు రాకుండా భయభ్రాంతులకు గురిచేసి తిరుపతికి వస్తారా? అంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more