గెజిట్‌ ఆధారంగా సర్టిఫికెట్లలో పేరు మార్పు

ABN , First Publish Date - 2022-02-19T07:34:50+05:30 IST

గెజిట్‌ ఆధారంగా విద్యార్థులు తమ సర్టిఫికెట్లలో పేరు మార్పు చేసుకునేందుకు ఎస్వీయూనివర్సిటీ అవకాశం కల్పించింది.

గెజిట్‌ ఆధారంగా సర్టిఫికెట్లలో పేరు మార్పు

విద్యార్థులకు అవకాశం కల్పించిన ఎస్వీయూ

కాలేజీలకు సమాచారాన్ని పంపిన అధికారులు


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 18: గెజిట్‌ ఆధారంగా విద్యార్థులు తమ సర్టిఫికెట్లలో పేరు మార్పు చేసుకునేందుకు ఎస్వీయూనివర్సిటీ అవకాశం కల్పించింది. గడిచిన 18 ఏళ్ల కాల వ్యవధిని పరిగణనలోకి తీసుకొని పేర్పు మార్పునకు ఫీజు నిర్ణయించింది. రూ.250 నుంచి రూ.2వేల దాకా ఫీజు వసూలు చేస్తారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అనుబంధ డిగ్రీ, పీజీ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీలకు పంపారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ హుస్సేన్‌ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 

Read more