గురువులకు జీవిత చరిత్ర పుస్తకాల బహూకరణ

ABN , First Publish Date - 2022-10-03T06:02:24+05:30 IST

చదువు చెప్పి, బంగారు భవిష్యత్తు చూపించిన గురువుల జీవిత చరిత్రను రచించి, ఆ పుస్తకాలను ఓ విధ్యార్థి తన గురువులకు ఆదివారం అంకితం చేశాడు.

గురువులకు జీవిత చరిత్ర పుస్తకాల బహూకరణ
గురువుకు జీవిత చరిత్ర పుస్తకాన్ని అందిస్తున్న విధ్యార్థి మల్లికార్జున

పూతలపట్టు, అక్టోబరు2 : చదువు చెప్పి, బంగారు భవిష్యత్తు చూపించిన గురువుల జీవిత చరిత్రను రచించి, ఆ పుస్తకాలను ఓ విధ్యార్థి తన గురువులకు ఆదివారం అంకితం చేశాడు. తిమ్మరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జున ఎర్రచెరువుపల్లె ఉన్నత పాఠఽశాల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివాడు. ప్రస్తుతం హిందీ ఉపాధ్యాయుడిగా ఎదిగాడు. తనకు విద్యాభ్యాసం చేయించిన ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి, వేషారెడ్డి, రంగనాథనాయుడుకు సంబంధించిన జీవిత చరిత్రలను పుస్తకం రూపంలో తీసుకొచ్చి ఆదివారం వారి ఇళ్లకు వెళ్లి వాటిని అందజేసి, సత్కరించారు.

Read more