జిల్లా విభజనపై 2253కు పైగా అభ్యంతరాలు

ABN , First Publish Date - 2022-03-05T06:34:03+05:30 IST

కొత్త జిల్లాల విభజనపై అభ్యంతరాలు వెల్లువలా వచ్చాయి.

జిల్లా విభజనపై 2253కు పైగా అభ్యంతరాలు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 4: కొత్త జిల్లాల విభజనపై అభ్యంతరాలు వెల్లువలా వచ్చాయి. గురువారం ఒక్కరోజే 2100కి మించి అందాయి. మొన్నటి వరకు 151 అభ్యంతరాలందగా వాటిలో వందకు పైగా నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో చేర్చాలని వచ్చాయి. ఇక, మదనపల్లెను రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని గురువారం ఎంఆర్‌పీఎస్‌ నాయకులు 2100కిపైగా దరఖాస్తులు అందించారు. శుక్రవారం ఉదయం నుంచి అందిన అభ్యంతరాలను డిస్ర్టిక్ట్‌ రీ ఆర్గనైజేషన్‌ పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. అందిన అభ్యంతరాల సంఖ్య శనివారం ఒక కొలిక్కివ చ్చే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పడిన కమిటీ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కలెక్టర్‌ సారథ్యంలోని జిల్లా స్థాయి కమిటీ అభ్యంతరాలను పరిష్కరించి ఈనెల 11న ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Read more