తప్పిపోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు అప్పగింత

ABN , First Publish Date - 2022-12-15T00:09:56+05:30 IST

పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తప్పిపోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు అప్పగింత

చిత్తూరు, డిసెంబరు 14: పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఉమామహేశ్వర్‌రావు చెప్పిన వివరాల మేరకు.. ఖాదీ వీధికి చెందిన అనీష, తనూష నగరంలోని ఖాదీ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని సోషల్‌ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. వారు ఓబనపల్లెలోని బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - 2022-12-15T00:09:59+05:30 IST