మహిషాసురమర్ధినిగా మరగదాంబిక

ABN , First Publish Date - 2022-10-07T06:47:20+05:30 IST

శరన్నవ రాత్రి వేడుకలలో భాగంగా కాణిపాకంలోని మణికంఠేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహిషాసురమర్ధిని అలంకారంలో మరగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసురమర్ధినిగా మరగదాంబిక
మహిషాసుర మర్ధిని అలంకారంలో మరగదాంబిక

శరన్నవ రాత్రి వేడుకలలో భాగంగా కాణిపాకంలోని మణికంఠేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహిషాసురమర్ధిని అలంకారంలో మరగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి, మహిషాసురమర్ధినిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయంలోని జమ్మి చెట్టు వద్ద శమిపూజ చేశారు. మరగదాంబిక అమ్మవారిని కాణిపాకం పురవీధులలో ఊరేగించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, సూపరింటెండెంట్‌ కోదండపాణి, అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు, భక్తులు పాల్గొన్నారు.

- ఐరాల(కాణిపాకం)


Read more