-
-
Home » Andhra Pradesh » Chittoor » Mango prices hit record highs-NGTS-AndhraPradesh
-
మామిడికి రికార్డు స్థాయి ధరలు
ABN , First Publish Date - 2022-07-05T06:52:04+05:30 IST
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి సోమవారం రికార్డు స్థాయి ధర పలికింది. గుజ్జు పరిశ్రమకు అవసరమయ్యే తోతాపురి రకం టన్ను రూ.65 వేలు పలికింది.

బంగారుపాళ్యం, జూలై 4: బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి సోమవారం రికార్డు స్థాయి ధర పలికింది. గుజ్జు పరిశ్రమకు అవసరమయ్యే తోతాపురి రకం టన్ను రూ.65 వేలు పలికింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే మల్గూబా రకం రూ.1.20 లక్షలు పలికింది. నీలం రకాలు నాణ్యత, పరిమాణాన్ని బట్టి టన్ను రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలికింది. పక్షం రోజుల్లో సీజన్ పూర్తి కానుండడం, మామిడి ధరలు అనూహ్యంగా పెరగడంతో మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.