-
-
Home » Andhra Pradesh » Chittoor » Make the CM visit a success Collector-NGTS-AndhraPradesh
-
సీఎం పర్యటనను విజయవంతం చేయండి : కలెక్టర్
ABN , First Publish Date - 2022-09-17T05:55:44+05:30 IST
ఈ నెల 22న సీఎం వై.ఎ్‌స.జగన్ కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆధికారులను ఆదేశించారు.

చిత్తూరు కల్చరల్, సెప్టెంబరు 16 : ఈ నెల 22న సీఎం వై.ఎ్‌స.జగన్ కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులు సమన్వయంతో వ్వవహరిస్తూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు, డీటీసీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్, ఎస్‌ఎ్‌సఏ, డీఈవో, ఆర్టీసీ అఽధికారులు పాల్గొన్నారు.