ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించండి
ABN , First Publish Date - 2022-08-13T06:07:58+05:30 IST
స్వచ్ఛంద సంస్థల అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ కరుణకుమార్ కోరారు.

చిత్తూరు లీగల్, ఆగష్టు 12: స్వచ్ఛంద సంస్థల అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని డీఎల్ఎస్ఏ సెక్రటరీ కరుణకుమార్ కోరారు. డీఎల్ఎస్ఏ భవనంలో శుక్రవారం స్వచ్ఛంద సంస్థల అధికారులతో ఆయన సమావేశ మయ్యారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తే నేరాల శాతం బాగా తగ్గించవచ్చునన్నారు. ముఖ్యంగా యువతకు అవగాహన కల్పిస్తే గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని పేర్కొన్నారు.