కాణిపాకంలో మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-16T07:33:29+05:30 IST

కాణిపాకంలో చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం పూజలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. పూజలు నిర్వహించడానికి ఆలయ అలంకార మండపం వద్ద యాగశాలను ఏర్పాటు చేశారు.

కాణిపాకంలో మహాకుంభాభిషేకం పూజలు ప్రారంభం
పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 15: కాణిపాకంలో చతుర్వేద హవన సహిత మహాకుంభాభిషేకం పూజలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. పూజలు నిర్వహించడానికి ఆలయ అలంకార మండపం వద్ద యాగశాలను ఏర్పాటు చేశారు. 21న ఆలయంలో జరిగే మహాకుంభాభిషేకాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు యాగశాలలో పూజలు. హోమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌, ఆలయ అధికారులు పూజాద్రవ్యాలను ఆలయ మాడవీధుల ద్వారా ఆలయంలోకి తీసుకొచ్చారు. అంకుర్పారణ నిర్వహించారు. యాగశాలలో వేదస్వస్తి, గణపతిపూజ, స్వస్తివాచనం, ఋత్విగ్వరుణ, పర్యగ్నీకరణం, మృత్సంగ్రహణం, రక్షాబంధనం, వాస్తుశాంతి, అంకురార్పణ, అఖండ దీపారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో సురే్‌షబాబు, ఈఈ వెంకటనారాయణ, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, రవీంద్రబాబు, హేమమాలిని, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T07:33:29+05:30 IST