పేరుకు పోయిన రుణ బకాయిలు

ABN , First Publish Date - 2022-03-05T06:25:00+05:30 IST

రుణ బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు కుప్పం జడ్పీటీసీ సభ్యుడు ఏడీఎస్‌ శరవణ తమ్ముడు కుమారవేలు పేరుతో ఉన్న భవనాన్ని కెనరా బ్యాంకు అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు.

పేరుకు పోయిన రుణ బకాయిలు
భవనాన్ని సీజ్‌ చేయిస్తున్న బ్యాంకు అధికారులు

జడ్పీటీసీ సభ్యుడి తమ్ముడి భవనం సీజ్‌  


కుప్పం, మార్చి 4: రుణ బకాయిలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు కుప్పం జడ్పీటీసీ సభ్యుడు ఏడీఎస్‌ శరవణ తమ్ముడు కుమారవేలు పేరుతో ఉన్న భవనాన్ని కెనరా బ్యాంకు అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. కుప్పం పట్టణంలోని కెనరా బ్యాంకు మేనేజరు శ్రావణ్‌కుమార్‌ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారవేలు 2017-18వ సంవత్సరంలో తమ శాఖలో రూ.3 కోట్లు రుణం తీసుకున్నారు. గతేడాది ఆగస్టులో కెనరా బ్యాంకులోని కుమారవేలు అకౌంట్‌ మూసివేశారు. అప్పటినుంచీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపుతున్నా స్పందించ లేదు. వడ్డీతో కలిసి రూ.3.6కోట్ల దాకా పెరిగిపోయింది. దీంతో బ్యాంకు అధికారులు శుక్రవారం కుప్పం-కృష్ణగిరి బైపాస్‌ రోడ్డులో అండర్‌ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఏడీఎస్‌ వాణిజ్య భవనాన్ని సీజ్‌ చేయడానికి వెళ్లగా   ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చివరకు పోలీసు బందోబస్తు నడుమ భవనాన్ని సీజ్‌ చేశారు. దీనిపై జడ్పీటీసీ సభ్యుడు శరవణ మాట్లాడుతూ... రుణం చెల్లింపు బకాయి ఉన్న మాట వాస్తవమేనన్నారు. అయితే తమకిచ్చిన గడువు ఈనెల 24 దాకా ఉందని, ఈలో అధికారులు ఇలా చేయడం భావ్యం కాదన్నారు.

Updated Date - 2022-03-05T06:25:00+05:30 IST