మట్టి వినాయకుడినే పూజిద్దాం

ABN , First Publish Date - 2022-08-31T07:13:30+05:30 IST

అందరూ మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ కోరారు.

మట్టి వినాయకుడినే పూజిద్దాం

చిల్లకూరు: అందరూ మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన సైకతశిల్పి మంచాల సనత్‌కుమార్‌ కోరారు. మంగళవారం ఏరూరు సమీపంలోని సముద్రతీరప్రాంతంలో గో గ్రీన్‌ అనే నినాదంతో వినాయకస్వామి సైకతశిల్పాన్ని ఆయన రూపొందించారు.ప్లాస్టర్‌ ఆఫ్‌ పారి్‌సతో చేసిన గణపతి విగ్రహాలతో పర్యావరణం కలుషితమవుతుందన్నారు, కాబట్టి అందరూ మట్టి వినాయకస్వామినే పూజించాలని కోరుకుంటూ సైకతసందేశం అందించానన్నారు.  

Read more