టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం

ABN , First Publish Date - 2022-10-08T04:53:11+05:30 IST

పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచర్లశ్రీకాంత్‌ను గెలిపించడానికి కార్యకర్తలు, యువత సైనికుల్లా పనిచేయాల్సిన అవసరముందని రాజంపేట పార్లమెంట్‌ తెలుగుయువత అధ్యక్షుడు నవీన్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం
కరపత్రాలను విడుదల చేస్తున్న టీడీపీ నాయకులు

పుంగనూరు, అక్టోబరు 7:  పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచర్లశ్రీకాంత్‌ను గెలిపించడానికి కార్యకర్తలు, యువత సైనికుల్లా పనిచేయాల్సిన అవసరముందని రాజంపేట పార్లమెంట్‌ తెలుగుయువత అధ్యక్షుడు నవీన్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.  శుక్రవారం పుంగనూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, తెలుగుయువత, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలన్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిస్తే రాష్ట్రం అధోగతి కాక తప్పదన్నారు.  రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి జరగాలంటే టీడీపీ గెలుపు అవసరమన్నారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌, పార్లమెంట్‌ తెలుగుయువత ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యంరాజు, రెడ్డెప్పనాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, సీవీరెడ్డి, చంద్ర, సద్దాం, నూరుల్లా, షామీర్‌, అల్తాప్‌, శివ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more