మండలి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందాం: చల్లాబాబు

ABN , First Publish Date - 2022-10-05T04:43:59+05:30 IST

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందామని పుంగనూరు ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పిలుపు నిచ్చారు.

మండలి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందాం: చల్లాబాబు
సమావేశంలో మాట్లాడుతున్న చల్లాబాబు

రొంపిచెర్ల, సెప్టెంబరు 4: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందామని పుంగనూరు ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు పిలుపు నిచ్చారు. మంగళవారం రొంపిచెర్లలోని స్వగృహంలో పుంగనూరు, చౌడేపల్లె మండలాల పార్టీ నాయకులతో తూర్పు రాయసీమ పట్టభద్రుల శాసనమండలి ఓటరు సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ పోటీ చేస్తున్నారని, నిరుద్యోగుల  హక్కుల కోసం ప్రశ్నించే వ్యక్తిగా పార్టీ ఎంపిక చేసిందన్నారు.  ఎన్నికల సభల్లో జాబ్‌ క్యాలెండర్‌ అంటూ నిరుద్యోగ యు వతకు ఆశలు కల్పించి సీఎంగా గద్దె ఎక్కగానే జగన్‌ ఈ విషయాన్ని విస్మరించడంపై యువతకు తెలియజేయాలని దిశానిర్దేశం చేవారు. ఇక ఓటరు నమోదుతో పాటు శ్రీకాంత్‌ గెలుపునకు కృషి చేద్దామన్నారు. విద్యావంతులైన యువతరం బాగుపడాలంటే  సీఎంగా చంద్రబాబు రావా ల్సి ఉందలన్నారు.  శ్రీకాంత్‌, సి.వి.రెడ్డి, గువ్వల రమేష్‌రెడ్డి, నూరుల్లా, మధుసూదనరెడ్డి, చిన్నమోహన్‌నాయుడు, షామీర్‌, అల్తాఫ్‌, వాసు, శ్రీనివాసులురెడ్డి, విశ్వనాఽథరెడ్డి, రామయ్య, మాధవరెడ్డి, నరసింహులు, దేశాంప్రకాష్‌, సబ్రమణ్యం, ఓబులేశ్వరరెడ్డి, ఉయ్యాల రమణ, సహదేవ, రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more