మూడ్రోజులు ఖజానా సర్వర్ డౌన్
ABN , First Publish Date - 2022-10-07T06:24:52+05:30 IST
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఖజనా శాఖలో కోడ్ల మార్పులు-చేర్పులు చేస్తుండడంతో గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ఖజానా సర్వర్ స్తంభించనుంది.
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 6: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఖజనా శాఖలో కోడ్ల మార్పులు-చేర్పులు చేస్తుండడంతో గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు ఖజానా సర్వర్ స్తంభించనుంది. సీఎ్ఫఎంఎ్సలో మండలాల మార్పులు, డీడీవోల (డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ల) కోడ్ల మార్పులు - చేర్పుల దృష్ట్యా అన్ని రకాల ఖజానా కార్యక్రమాలు స్తంభించనున్నట్లు చిత్తూరు జిల్లా ఖజానా శాఖ అధికారులు తెలిపారు. డీడీవోలు, సీనియర్ అకౌంటెంట్లు సబ్ ట్రెజరీ స్థాయిలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను క్లోజ్ చేసి, ఈ నెల 10 తర్వాత కొత్తగా బిల్లులు తయారు చేసి ట్రెజరీకి అందించాలని సూచించారు.