శ్రీనివాస సేతులో కరకంబాడి మార్గం ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-07T07:16:05+05:30 IST

తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ రెండో దశ కూడా అందుబాటులోకి వచ్చింది.

శ్రీనివాస సేతులో కరకంబాడి మార్గం ప్రారంభం

తిరుపతి,అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి):తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ రెండో దశ కూడా అందుబాటులోకి వచ్చింది. కరకంబాడి మార్గం నుంచి లీలామహల్‌ సర్కిల్‌ మీదుగా కపిలతీర్థం రోడ్డు వరకు నిర్మించిన ఈ మార్గాన్ని  ఎంపీ గురుమూర్తి, ఎమ్మె ల్యే  కరుణాకర రెడ్డి, మేయరు శిరీషలతో కలసి టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి  బుధవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మూడో దశ పనులు కూడా జనవరికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.


Read more