కన్నుల పండువగా ధ్వజావరోహణం

ABN , First Publish Date - 2022-09-10T06:05:27+05:30 IST

కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహంచారు.

కన్నుల పండువగా ధ్వజావరోహణం
ధ్వజపటాన్ని దించుతున్న అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 9: కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం ధ్వజావరోహణ కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహంచారు. నూతన ధ్వజస్తంభంపై ఉన్న మూషిక ధ్వజపటాన్ని మేళ తాళాలు, వేద మంత్రాల నడుమ కిందకు దించారు. దీంతో స్వామివారి  బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శనివారం నుంచి వరసిద్ధుడి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను 11 రోజుల పాటు ఉభయదారులు నిర్వహించనున్నారు. ధ్వజావరోహణం అనంతరం చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబుకు కట్టిన కంకణాలను అర్చకుడు ధర్వేశ్వరగురుకుల్‌ తొలగించారు. అనంతరం చైర్మన్‌, ఈవోను గజమాలతో సత్కరించి, ఆలయ మర్యాదలతో మేళ,తాళాల నడుమ వారిని కార్యాలయ భవనానికి తీసుకెళ్లారు. ఈ కార్యాక్రమాన్ని ఆచార్యోత్సవం అంటారు. 

Updated Date - 2022-09-10T06:05:27+05:30 IST