కాణిపాకంలో పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2022-03-06T05:07:20+05:30 IST
కాణిపాక క్షేత్రం శనివారం భక్తుల రద్దీతో పొటెత్తింది.
ఐరాల(కాణిపాకం),మార్చి5: కాణిపాక క్షేత్రం శనివారం భక్తుల రద్దీతో పొటెత్తింది. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయి వెలుపలకు విచ్చేశారు. దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. స్వామిని సుమారు ఇరవైవేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.