పట్టుకో.. పట్టుకో..
ABN , First Publish Date - 2022-01-15T07:17:52+05:30 IST
సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామచంద్రాపురం మండలం గోకులాపురం, అనుపల్లె గ్రామాలలో శుక్రవారం జల్లికట్టు ఉత్కంఠభరితంగా జరిగింది.
రామచంద్రాపురం: సంక్రాంతి సంబరాల్లో భాగంగా రామచంద్రాపురం మండలం గోకులాపురం, అనుపల్లె గ్రామాలలో శుక్రవారం జల్లికట్టు ఉత్కంఠభరితంగా జరిగింది. తొలుత రైతులు తమ కోడెగిత్తలకు గ్రామ శివార్లో పూజలు నిర్వహించి వాటి కొమ్ములకు విలువైన బహుమతులు కట్టి అల్లి వద్దకు తీసుకొచ్చారు. వీటి వెనుక డప్పులు మోగించడంతో అవి వీధుల్లోకి పరుగులు తీశాయి. యువకులు జట్టుగా ఏర్పడి వీటిని నిలువరించే క్రమంలో స్వల్పగాయాలయ్యాయి. బహుమతులు అందుకున్న వారు ఉత్సాహంతో ఉరకలేశారు. వీటిని చూసేందుకు తిరుపతి రూరల్, చంద్రగిరి, వెదురుకుప్పం మండలాల నుంచి వచ్చిన వారితో ఈ ప్రాంతం జనసంద్రంగా మారింది.