వాన దంచేసింది
ABN , First Publish Date - 2022-08-04T06:29:06+05:30 IST
రుతు పవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 27 మండలాల్లో బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా నగరిలో 40.4మి.మీ, అత్యల్పం
- నగరిలో అత్యధికంగా 40.4మి.మీ
- ఐరాలలో అత్యల్పంగా 2.2మి.మీ
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 3: రుతు పవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 27 మండలాల్లో బలమైన వర్షం కురిసింది. అత్యధికంగా నగరిలో 40.4మి.మీ, అత్యల్పంగా ఐరాలలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కార్వేటినగరం 39.4, వి.కోట 36.8, పుంగనూరు 35.2, రామకుప్పం 32.8, బైరెడ్డిపల్లి 27.2, విజయపురం 26.2, శాంతిపురం 21.2, చౌడేపల్లి 20.4, గుడుపల్లి 14.4, సదుం 14.2, పాలసముద్రం 13.2, బంగారుపాళ్యం 12.4, పెనుమూరు 10.4, సోమల 10.4, పెద్దపంజాణి 10.4, యాదమరి 9.2, గంగవరం 8.2, కుప్పం 8, వెదురుకుప్పం 5.2, శ్రీరంగరాజపురం 5.2, పూతలపట్టు 4.8, గుడిపాల 4.2, నిండ్ర 3.2, గంగాధరనెల్లూరు 3మి.మీ కురిసింది. భారీ వర్షం కురిసిన మండలాల్లో లోతట్టు ప్రాంతా లు, పొలాల్లోకి నీరు చేరాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో ఇబ్బందిపడ్డారు.