జనగణమన లక్ష గర్జనకు అనుమతివ్వకపోవడం దేశద్రోహమే

ABN , First Publish Date - 2022-02-28T05:43:55+05:30 IST

జాతీయగీతం జనగణమనకు 103 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని మదనపల్లె జిల్లా సాధనలో భాగంగా ఫిబ్రవరి 28న జనగణమన లక్షగళ గర్జన పేరుతో బీటీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం దేశద్రోహమే అని జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ అన్నారు.

జనగణమన లక్ష గర్జనకు అనుమతివ్వకపోవడం దేశద్రోహమే
జనగణమన లక్ష గర్జన నిర్వహించరాదని పోలీసులు ఇచ్చిన నోటీసులు చూపుతున్న జిల్లా సాధన సమితి సభ్యులు

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 27: జాతీయగీతం జనగణమనకు 103 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని మదనపల్లె జిల్లా సాధనలో భాగంగా ఫిబ్రవరి 28న జనగణమన లక్షగళ గర్జన పేరుతో బీటీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడం దేశద్రోహమే అని జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో కోకన్వీనర్లు శ్రీచందు, హరికృష్ణ, కోనేటి దివాకర్‌ తదితరులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సభ నిర్వహణపై పదిరోజుల ముందే డీఎస్పీ రవిమనోహరాచారికి దరఖాస్తు చేసుకున్నా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ చివరకు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేయడం భావ్యం కాదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మదనపల్లె పోలీసుల నిరంకుశత్వం కొనసాగుతోందన్నారు. పోలీసుల అనుమతి తీసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కితే  అరెస్టులు చేయడం, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  జాతీయగీతం పట్ల గౌరవంతో, దేశంపట్ల ప్రేమతో అనుమతి ఇవ్వకపోయినా జనగణమన లక్షగళ గర్జన జరిపి తీరుతామన్నారు. సోమవారం ఉదయం 11గంటలకు బీటీ కాలేజీలో జరిగే కార్యక్రమంలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జేఎస్‌ఎస్‌ నాయకులు ఆనంద్‌, రవిశకర్‌, శేఖర్‌, రెడ్డెప్ప, శ్రీనివాసులు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-02-28T05:43:55+05:30 IST