ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-05T07:45:22+05:30 IST

వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మురళీకృష్ణ తెలిపారు.

ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

వెంకటగిరి, జూలై 4: వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మురళీకృష్ణ తెలిపారు. టెన్త్‌ పాసైన  బీసీ, జనరల్‌ కేటగిరీలకు 15-23 ఏళ్లలోపువారు, షెడ్యూ లు కులాలు, తెగలవారైతే 25 ఏళ్లలోపువారు అర్హులన్నారు. ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ (టెక్స్‌టైల్‌), ఐటీఐ పాసైన విద్యార్థులకు నేరుగా డీహెచ్‌టీటీ కోర్సుల్లో రెండే ళ్ల ప్రవేశానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కళాశాలలో 53 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఐహెచ్‌టీవీజీఆర్‌.సీవోఎం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 08622-295003, 93999 36872, 98661 69908, 90102 43054 నెంబర్లను సంప్రదించాలని కోరారు.


Read more