అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-09-08T05:59:16+05:30 IST

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, మినీ, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు, సెప్టెంబరు 7: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ, మినీ, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 అంగన్‌వాడీ, 13 మినీ అంగన్‌వాడీ , 56 ఆయా పోస్టులు కలిపి మొత్తం 87 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆయా సీడీపీవో కార్యాలయాల్లో వివరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పదో తరగతి పాసైన వివాహితులు గురువారం నుంచి ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లోనే సమర్పించాలని తెలిపారు.

Read more