-
-
Home » Andhra Pradesh » Chittoor » Interpracticals from today-NGTS-AndhraPradesh
-
నేటినుంచి ‘ఇంటర్ ప్రాక్టికల్స్’
ABN , First Publish Date - 2022-03-16T07:02:14+05:30 IST
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు నాలుగు దశల్లో జరగనున్నాయి.

164 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
హాజరుకానున్న 35,554మంది విద్యార్థులు
తిరుపతి(విద్య), మార్చి 15: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు నాలుగు దశల్లో జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 164 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. జనరల్, ఒకేషన్ కోర్సులు కలిపి 35,554మంది విద్యార్థులు హాజరు కానున్నారని ప్రాంతీయ బోర్డు పర్యవేక్షణ అధికారి వై.వెంకటరెడ్డి తెలిపారు. రోజూ ఉదయం 9-12 గంటల మధ్య, మధ్యాహ్నం 2-5గంటల వరకు రెండు సెషన్లలో సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. కాగా.. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 11నుంచి ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.