థర్మాకోల్‌ రీసైక్లింగ్‌ పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-01-23T06:04:34+05:30 IST

రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఏర్పాటుచేసిన థర్మాకోల్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష పరిశీలించారు.

థర్మాకోల్‌ రీసైక్లింగ్‌ పనుల పరిశీలన
ప్లాంట్‌లో పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌ గిరీష

రేణిగుంట, జనవరి 22: మండలంలోని తూకివాకం వద్ద ఏర్పాటుచేసిన థర్మాకోల్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను శనివారం తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ గిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే తొలిసారి థర్మాకోల్‌ను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా ఫొటోఫ్రేమ్స్‌, వాచ్‌ల ప్యాకింగ్‌ మెటీరియల్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి ఈ ప్లాంట్‌ ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచేలా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌలీశ్వర్‌రెడ్డి, డీఈ విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read more