పాఠశాల బస్సుల తనిఖీ

ABN , First Publish Date - 2022-03-05T06:54:49+05:30 IST

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పాఠశాల బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని డీటీసీ బసిరెడ్డి చెప్పారు.

పాఠశాల బస్సుల తనిఖీ
పుత్తూరులో పాఠశాల బస్సు తనిఖీ చేస్తున్న ఎంవీఐ మధుసూదన్‌

20 కేసులు, రూ.1.5 లక్షల జరిమానా


చిత్తూరు సిటీ, మార్చి 4: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పాఠశాల బస్సులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని డీటీసీ బసిరెడ్డి చెప్పారు. తనిఖీల్లో ట్యాక్స్‌, పర్మిట్‌, ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌) చేయని 20 బస్సులపై కేసు నమోదు చేసి, రూ.1.5 లక్షల జరిమానా విధించామని తెలిపారు. డ్రైవర్లు తాగి డ్రైవింగ్‌ చేసినా, లైసెన్సు లేకపోయినా బస్సును సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. వాహనాల రికార్డులన్నీ సక్రమంగా ఉంచుకోవాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. లైసెన్స్‌ కలిగిన డ్రైవర్లనే విధుల్లో ఉంచుకోవాలని, బస్సుల కండీషన్‌ను రోజూ పరిశీలించాలన్నారు. 

Updated Date - 2022-03-05T06:54:49+05:30 IST