వంక పారిదంటే అవస్థలే..!
ABN , First Publish Date - 2022-08-04T06:23:57+05:30 IST
రెండు రోజలుగా కురిసిన వర్షాలకే చిట్టేరు వంకలో నీటి ప్రవాహం మొదలైంది. దీంతో పీ.బీ.అగ్రహారం గ్రామానికి చెందిన విద్యార్థులు హైస్కూళ్లకు, కాలేజ్‌లకు వెళ్లాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ పరిధిలోని పీ.బీ.అగ్రహారం గ్రామానికి చెందిన విద్యార్థులు 8, 9, 10వ తరగతి విద్యార్థులు 36 మంది ముక్కళత్తూరు హైస్కూల్‌కు వెళుతున్నారు.
ఏళ్ల తరబడిగా చిట్టేరు వంకపై బ్రిడి నిర్మాణానికి గ్రామస్తుల విన్నపం
పరిశీలనకే పరిమితమైన అధికారులు
గంగాధరనెల్లూరు, ఆగస్టు 3: రెండు రోజలుగా కురిసిన వర్షాలకే చిట్టేరు వంకలో నీటి ప్రవాహం మొదలైంది. దీంతో పీ.బీ.అగ్రహారం గ్రామానికి చెందిన విద్యార్థులు హైస్కూళ్లకు, కాలేజ్‌లకు వెళ్లాలంటే నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ పరిధిలోని పీ.బీ.అగ్రహారం గ్రామానికి చెందిన విద్యార్థులు 8, 9, 10వ తరగతి విద్యార్థులు 36 మంది ముక్కళత్తూరు హైస్కూల్‌కు వెళుతున్నారు. వీరందరూ నీవానది మీదుగా ముక్కళత్తూరుకు వెళ్లడానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వర్షాల వల్ల నీవానది ప్రవాహం సాగుతుండటంతో వేల్కూరులో దూరి గంగాధరనెల్లూరు మీదుగా హైస్కూల్‌కు చేరుకోవాలంటే 8 కిలోమీటర్ల దూరం పెరిగింది. అలాగే చిత్తూరు నగరంలోని ప్రయివేట్ స్కూళ్లకు 60మంది విద్యార్థులు వెళుతున్నారు. అగ్రహారం గ్రామానికి చెందిన విద్యార్థులందరూ వేల్కూరు వద్ద చిట్టేరువంక దాటాల్సి ఉంటుంది. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు చిట్టేరువంకలోప్రవాహం సాగుతుండడంతో వంకను దాటడానికి నానా అవస్థలు పడుతున్నారు. నీటి ప్రవాహం తీవ్రంగా సాగిందంటే పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు పలుసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చినా లాభం లేకపోయింది. గతంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పరిశీలించి వెళ్లారే తప్ప తర్వాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించాలని కోరుతున్నారు.