ఆ జీతానికి అంతంత దూరం ఎలా వెళ్లగలం?

ABN , First Publish Date - 2022-12-31T00:40:49+05:30 IST

తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట శుక్రవారం రెండవ ఏఎన్‌ఎంలు నిరసన చేపట్టారు.

ఆ జీతానికి అంతంత దూరం ఎలా వెళ్లగలం?
డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలు

కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలంటూ రెండవ ఏఎన్‌ఎంల నిరసన

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 30: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చిత్తూరు డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట శుక్రవారం రెండవ ఏఎన్‌ఎంలు నిరసన చేపట్టారు. ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ.. తమ సొంత ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా రూ.16 వేలకు పనిచేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలను కౌన్సిలింగ్‌ పేరుతో వేధించడం సరికాదన్నారు. రూ.16 వేల జీతానికి 200 కిలో మీటర్ల దూరం వెళ్లి పనిచేయాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే కౌన్సిలింగ్‌ను రద్దు చేయాలని డిమాండు చేశారు. వీరికి ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు లక్ష్మీనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నాయకులు మద్దతు పలికారు.

Updated Date - 2022-12-31T00:40:49+05:30 IST

Read more