పాలీహౌస్‌లతో అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2022-08-18T05:06:22+05:30 IST
సాధారణ వాతా వరణ పరిస్థితుల్లో సాగుచేసే పంటలకంటే పాలీ హౌస్‌లలో పండించడం వల్ల అధిక దిగుబడులు సాధ్యమవుతాయని జిల్లా ఉ ద్యానశాఖాఽధికారి మధుసూదన్‌రెడ్డి అ న్నారు. కుప్పంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ (హార్టి కల్చ ర్ హబ్)లో పాలీహౌస్‌లతో చేకూరే ప్ర యోజనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

కుప్పం, ఆగస్టు 17: సాధారణ వాతా వరణ పరిస్థితుల్లో సాగుచేసే పంటలకంటే పాలీ హౌస్‌లలో పండించడం వల్ల అధిక దిగుబడులు సాధ్యమవుతాయని జిల్లా ఉ ద్యానశాఖాఽధికారి మధుసూదన్‌రెడ్డి అ న్నారు. కుప్పంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ (హార్టి కల్చ ర్ హబ్)లో పాలీహౌస్‌లతో చేకూరే ప్ర యోజనాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీ హెచ్‌వో మాట్లాడుతూ... పాలీహౌస్‌లలో నియం త్రిత వాతావరణ పరిస్థితులు ఉంటాయని, ఏ పంటకు ఎంత ఉష్ణోగ్రత కావాలో అంతే అం దుతుందన్నారు. ఇందువల్ల దిగుబడులు పెరు గుతాయని చెప్పారు. పంటలను ఆశించే చీడ పీడల బెడద తప్పుతుందన్నారు. పాలీ హౌస్ లలో సాగుచేసే పద్ధతులను వివరించారు. కంపెనీల ప్రతినిధులు పాలీ హౌస్‌లలో వంగ, క్యాప్సికమ్, బంతి సాగుచేసే పద్ధతులను వీడి యో క్లిప్పింగ్‌ల ద్వారా అవగాహన కల్పించారు. రైతులందరూ పాలీ హౌస్‌లను నిర్మించుకుని లాభాలు గడించాలని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు కోటేశ్వరరావు, శాస్త్రవేత్త శ్రీలత, కు ప్పం మండల ఉద్యానశాఖాధికారి డింపుప్రియ సూచించారు.
వి.కోట: ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవ లంబించడం ద్వారా పూలసాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్త శ్రీలత సూచించారు. బుధవారం వి.కోట స్ర్తీ శక్తి భవన్ లో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పూలతోటల సాగు లో మెలకువలపై అవగాహన కల్పించారు. మ ల్చింగ్ విధానంలో పూలసాగు చేపట్టడం ద్వారా ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు సాధ్య మన్నారు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసి, తెగుళ్లు నివారించ్చ వచ్చాన్నారు. పూల తోటలను ఆశించే తెగుళ్లు, వాటి నివారణపై అవ గాహన కల్పించారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదనరెడ్డి, ఉద్యాన సహాయ సంచాల కుడు కోటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ మండలి సభ్యుడు భరత్‌రెడ్డి, మండల వ్యవసాయ మండలి అధ్యక్షుడు సుబ్బారెడ్డి, హెచ్‌వో లక్ష్మీప్రసూన, ఆర్బీకే సభ్యులు పాల్గొన్నారు.