ఘనంగా కార్తీకదీప మహోత్సవం
ABN , First Publish Date - 2022-12-07T00:02:59+05:30 IST
తమిళ కార్తీకమాసం కృత్తిక సందర్భంగా మంగళవారం చిత్తూరులోని పలు ఆలయాల్లో మంగళవారం కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహించారు.
చిత్తూరు కల్చరల్, డిసెంబరు 6: తమిళ కార్తీకమాసం కృత్తిక సందర్భంగా మంగళవారం చిత్తూరులోని పలు ఆలయాల్లో మంగళవారం కార్తీక దీప మహోత్సవాన్ని నిర్వహించారు. గిరింపేట శ్రీవళ్లి దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈవో మునిశేఖర్ ఆధ్వర్యంలో అర్చకులు అభిషేకం చేశారు. దీపపు గరిగను ఊరేగింపుగా తీసుకెళ్లి కొండపై వెలిగించారు. దొడ్డిపల్లె సప్తకన్నికల ఆలయంలో వంశపారంపర్య ధర్మకర్త దళవాయి శివకుమార్ ఆధ్వర్యంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు లక్ష దీపారాధనను జ్యోతి వెలిగించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి, మేయర్ అముద, డిప్యూటి మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. దుర్గాంబ ఆలయంలో ఈవో మునిశేఖర్ ఆధ్వర్యంలో పాలకమండలి ఛైర్మన్ కృష్ణమూర్తి, దుర్గానగర్ కాలనీ సర్వసిద్ధి వినాయక ఆలయం, గిరింపేట చిదంబరేశ్వర, అగస్త్యీశ్వర, రాజుగుడి, కట్టమంచి కులందేశ్వర, ఇరువారం నాగేంద్ర ఆలయాల్లోనూ కార్తీక దీపోత్సవాలు జరిగాయి.