జగనన్న కాలనీలకు 6 సబ్‌స్టేషన్ల మంజూరు

ABN , First Publish Date - 2022-11-30T00:11:45+05:30 IST

జిల్లాలోని జగనన్న కాలనీలకు 6 విద్యుత్తు సబ్‌ స్టేషన్లు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు.

 జగనన్న కాలనీలకు 6 సబ్‌స్టేషన్ల మంజూరు

చిత్తూరు రూరల్‌, నవంబరు 29: జిల్లాలోని జగనన్న కాలనీలకు 6 విద్యుత్తు సబ్‌ స్టేషన్లు మంజూరైనట్లు సదరన్‌ డిస్కం ఎస్‌ఈ కృష్ణారెడ్డి మంగళవారం తెలిపారు. నాలుగు వేల సర్వీసులకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌ను రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తొండవాడ, ఏర్పేడు, కల్లూరు, పుంగనూరు ప్రాంతాలకు కూడా సబ్‌స్టేషన్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు.

Updated Date - 2022-11-30T00:11:45+05:30 IST

Read more