ఇసుక, ఓటీఎస్ పేరుతో ప్రభుత్వ దోపిడీ
ABN , First Publish Date - 2022-01-18T05:48:27+05:30 IST
ఓటీఎస్, ఇసుక పేరుతో ప్రజలను దోచుకుంటున్న వైసీపీ ప్రభు త్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ ధ్వజమెత్తారు.

మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ ధ్వజం
నిమ్మనపల్లె జనవరి 17: ఓటీఎస్, ఇసుక పేరుతో ప్రజలను దోచుకుంటున్న వైసీపీ ప్రభు త్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ ధ్వజమెత్తారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహిం చారు. బస్టాండులోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన మాట్లాడు తూ... వైసీపీ ప్రభుత్వంలో హత్యారాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. రాష్ట్రంలో దౌర్జ న్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఇక ఓటీఎస్ పేరుతో గతంలో నిర్మించుకొన్న ఇళ్లకు ఇప్పుడు రూ.10వేలు చెల్లించాలనడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలోని పేదల గ్రూపుల్లో నగదు వేసి అదే డబ్బును ఓటీఎస్‌కు జమ చేస్తు న్నారన్నారు. అదే విధంగా ట్రాక్టర్ లోడు ఇసుక ను రూ.4000కు వైసీపీ నాయకులు అమ్ముకుంటు న్నారని, సచివాలయ సిబ్బంది స్లిప్పులు వారికే ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం ముస్లింలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోగా రూ.5000వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోందన్నారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలను నిలిపివేసిందన్నారు. బండ్లపై మాజీ సర్పంచ్ లక్ష్మన్న ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరమణ, ఆర్జే వెంకటేష్, సుజాత, మల్లికార్జున, విజయ్, శంకర, చినబాబు, మునిరత్నం, సుధాకర్‌రావు, మధు బాబు, శ్రీనివాసులు, చెండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.