‘టెట్‌’ రాసే కొడుక్కి తోడుగా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

ABN , First Publish Date - 2022-08-13T07:11:41+05:30 IST

బంగారుపాళ్యం మండలం అరగొండ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుల కళ్లముందే వరదరాజులు(68) మృతిచెందారు.

‘టెట్‌’ రాసే కొడుక్కి తోడుగా వెళ్లి..   రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి
మృతిచెందిన వరదరాజులు

బంగారుపాళ్యం, ఆగస్టు 12: బంగారుపాళ్యం మండలం అరగొండ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుల కళ్లముందే వరదరాజులు(68) మృతిచెందారు. సీఐ నరసింహారెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున్‌ రెడ్డి, బాధితులు తెలిపిన ప్రకారం.. గంగవరం మండలం మల్లేరు గ్రామానికి చెందిన వరదరాజులుకు హరికృష్ణ, బాలాజీ కుమారులు. వీరిలో హరికృష్ణ వికలాంగుడు. చిత్తూరులోని ఎస్వీసెట్‌ కాలేజ్‌లో శుక్రవారం నిర్వహించిన ఏపీటెట్‌ రాయడానికి హరికృష్ణకు తోడుగా తండ్రి వరదరాజులు, సోదరుడు బాలాజీ ఓ ఆటోలో వెళ్లారు. పరీక్ష రావాక స్వగ్రామానికి వెళ్తుండగా వెనుకవైపునుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఆటోను ఢీకొంది. సమీపంలో వెళ్తున్న మోటారు సైకిల్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడడంతో వరదరాజులు తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. బాలాజీ, హరికృష్ణ, ద్విచక్ర వాహనదారుడు విజయ్‌, ఆటోడ్రైవర్‌ రాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-08-13T07:11:41+05:30 IST