గజరాజు హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-10-08T04:55:43+05:30 IST

పలమనేరు పట్టణ సమీపంలోని జగమర్ల క్రాస్‌ వద్ద (జాతీయ రహదారి) శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఏనుగు సందడి చేసింది.

గజరాజు హల్‌చల్‌
శుక్రవారం సాయంత్రం పలమనేరు సమీపంలో జాతీయ రహదారి దాటుతున్న ఏనుగు

పలమనేరు, అక్టోబర్‌ 7: పలమనేరు పట్టణ సమీపంలోని జగమర్ల క్రాస్‌ వద్ద (జాతీయ రహదారి) శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఏనుగు  సందడి చేసింది. జాతీయ రహదారికి ఉత్తరం వైపు ఉన్న జగమర్ల అటవీ ప్రాంతం నుంచి దక్షిణం వైపున్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఏనుగు రహదారిపైకి రావడంతో  రెండు వైపులా  వాహనదారులు ఆగిపోయారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. 

Read more