-
-
Home » Andhra Pradesh » Chittoor » Freedom is the result of the sacrifice of Congress leaders-NGTS-AndhraPradesh
-
కాంగ్రెస్ నాయకుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రం
ABN , First Publish Date - 2022-08-15T06:31:08+05:30 IST
కాంగ్రెస్ నాయకుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు.

తవణంపల్లె, ఆగస్టు 14: కాంగ్రెస్ నాయకుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పేర్కొన్నారు. తవణంపల్లె మండలంలోని దిగువమాఘం రాజన్న పార్కులో గల స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్‌నాయుడు శిలావిగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురే్‌షబాబుతో కలిసి మాలలు వేసి, నివాళులర్పించారు. నాడు కొందరు రాజుల అనైక్యత కారణంగా 700 సంవత్సరాలు బానిసత్వం అనుభవించగా ప్రస్తుతం కొన్ని పార్టీల వల్ల దేశంలో అంతఃకలహాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు పోరాటాలు సాగించి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మెంబరు పార్థసారథిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్‌నాయుడు, కొండ్రాజుకాల్వ మాజీ సర్పంచ్ మహేష్, హరి, శ్రీధర్, జ్యోతినాయుడు, నాయకులు వెంకటరమణ, భాస్కర్‌రెడ్డి, వినయ్‌తుల్లా, దిగువమాఘం గ్రామస్తులు పాల్గొన్నారు.