ఎస్పీడబ్ల్యూ విద్యార్థినికి ఈసెట్‌లో రెండో ర్యాంకు
ABN , First Publish Date - 2022-08-11T06:28:21+05:30 IST
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాది కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు.

-ఎస్వీజీపీ విద్యార్థులకు 9,10ర్యాంకులు
తిరుపతి(విద్య),ఆగస్టు10: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ రెండో ఏడాది కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఈసెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు.అబ్బాయిల కన్నా అమ్మాయిలు దాదాపు 5శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు.విద్యార్థులు 90.94శాతంమంది పాసవ్వగా..విద్యార్థినులు 95.54శాతం మంది పాసయ్యారు. పరీక్షలకు 2180మంది విద్యార్థులు హాజరుకాగా 2003మంది ఉత్తీర్ణులయ్యారు.ఎలక్ర్టానిక్స్ విభాగంలో శ్రీపద్మావతి పాలిటెక్నిక్ విద్యార్థిని ఎన్.భువనేశ్వరి 150మార్కులతో రెండవర్యాంకు సాధించారు.ఈమె రామచంద్రాపురం మండలం సి.రామాపురంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన దేవి, సుధాకర్‌రెడ్డి దంపతుల కుమార్తె.ఎలక్ర్టికల్ విభాగంలో ఎస్వీ పాలిటెక్నిక్‌కు చెందిన ఎం.అనిల్‌కుమార్‌రెడ్డి 151మార్కులతో 9వర్యాంకు, వై.వెంకట ఆదిత్యరామ్ 148మార్కులతో 10వర్యాంకును కైవసం చేసుకున్నారు.ఫార్మసీలో తిరుపతి మారుతీనగర్‌కు చెందిన నవ్యశ్రీ 111మార్కులతో 5వర్యాంకు, తిరుమలనగర్‌కు చెందిన భార్గవి 103మార్కులతో 9వర్యాంకు సాధించారు. సిరామిక్ టెక్నాలజీలో గూడూరులో కొమ్మనేటూరుకు చెందిన బి.విష్ణువర్దన్‌రెడ్డి రెండోర్యాంకు పొందారు.