పొగమంచు కారణంగా వెనక్కెళ్లిన విమానం
ABN , First Publish Date - 2022-12-16T01:10:39+05:30 IST
తిరుపతి విమానాశ్రయంలో దిగాల్సిన విమానం పొగమంచు కారణంగా వెనక్కెళ్లిపోయింది. గురువారం హైదరాబాదు నుంచి తిరుపతి మీదుగా ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఒకటి ఉదయం 7.30 గంటలకు తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. అయితే విమానాశ్రయంలో పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించక కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి.. తిరిగి హైదరాబాదుకు వెళ్లిపోయింది.
తిరుపతి (తిలక్‌రోడ్డు), డిసెంబరు 15: తిరుపతి విమానాశ్రయంలో దిగాల్సిన విమానం పొగమంచు కారణంగా వెనక్కెళ్లిపోయింది. గురువారం హైదరాబాదు నుంచి తిరుపతి మీదుగా ముంబైకి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఒకటి ఉదయం 7.30 గంటలకు తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి. అయితే విమానాశ్రయంలో పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించక కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి.. తిరిగి హైదరాబాదుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఉదయం 10గంటలకు బయల్దేరి 10.50కి తిరుపతి విమానాశ్రయం చేరుకుంది. ఆపై 11.10గంటలకు ముంబై బయల్దేరి వెళ్లింది. అలాగే ఉదయం 7.30 గంటలకు బెంగళూరు నుంచి తిరుపతి రావాల్సిన ఇండిగో విమానం కూడా గంట ఆలస్యంగా 8.30గంటలకు బయల్దేరి పొగమంచు కారణంగా కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టి 9.50గంటలకు తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. తిరిగి 10.40గంటలకు విశాఖకు బయల్దేరి వెళ్లింది.