టెన్త్‌ పరీక్షా కేంద్రాల మార్పుపై కసరత్తు

ABN , First Publish Date - 2022-03-05T06:35:06+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను మార్పు చేయడంపై అధికారులు దృష్టి సారించారు.

టెన్త్‌ పరీక్షా కేంద్రాల మార్పుపై కసరత్తు

చిత్తూరు (సెంట్రల్‌), మార్చి 4: ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలను మార్పు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో  53వేల మంది పదో తరగతి పరీక్షలు రాసేలా 375 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో జూనియర్‌ కళాశాలలూ ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా ప్రాంతీయ ఇంటర్మీడియట్‌ అధికారులు 142 కేంద్రాలు గుర్తించారు. ఇంటర్‌ పరీక్షల ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు, టెన్త్‌ పరీక్షలు మే 2 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఒకేసారి రెండు పరీక్షలు జరుగుతున్న క్రమంలో దాదాపు 31 జూనియర్‌ కళాశాలలు ఇరువురికి సెంటర్లు కావడం సమస్యగా మారింది. దీంతో జిల్లా పరీక్షల విభాగం అధికారులు అదనంగా మరో 31 కేంద్రాలను గుర్తించే పనిలో పడ్డారు. ప్రాంతాల సౌలభ్యం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ  పరీక్షల డైరెక్టర్‌కు నివేదిక అందజేయనున్నారు. 

Read more