ముగిసిన కళా ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-12-07T00:07:21+05:30 IST

స్థానిక డైట్‌లో రెండో రోజుల పాటు నిర్వహించిన కళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు హైస్కూల్‌ బాలికలు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ నృత్యాలు అందర్నీ అకట్టుకున్నాయి.

ముగిసిన కళా ఉత్సవాలు
బాలికల శాస్త్రీయ జానపద నృత్యాల ప్రదర్శన

కార్వేటినగరం, డిసెంబరు 6: స్థానిక డైట్‌లో రెండో రోజుల పాటు నిర్వహించిన కళా ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు హైస్కూల్‌ బాలికలు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ నృత్యాలు అందర్నీ అకట్టుకున్నాయి. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 12వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ శ్రీరామ పురుషోత్తం తెలిపారు. జానపద నృత్య బాలికల విభాగంలో పులికొండ్రం హైస్కూల్‌ దేవిప్రియ, పుత్తూరు వేదవ్యాస త్రిష మొదటి రెండు స్ధానాల్లో నిలిచారని పేర్కొన్నారు. బాలుర విభాగంలో ఎస్‌ఆర్‌ పురం చరణ్‌తేజ్‌, బైరెడ్డిపల్లికి చెందిన తనుష్‌ విజేతలుగా నిలిచారని తెలిపారు. శాస్ర్తీయ నృత్యంలో పుత్తూరు చైతన్య హైస్కూల్‌ లేఖ్య చందన, షర్మిల గెలిచినట్లు చెప్పారు. జానపద గీతాల్లో పుత్తూరు చందుప్రియ, ఎస్‌ఆర్‌ పురం పూజ విజేతలుగా నిలిచినట్లు పేర్కొన్నారు. శాస్త్రీయ గాత్రం బాలికల విభాగంలో బైరెడ్డిపల్లికి చెందిన జయలక్ష్మి, పుత్తూరు బాలచంద్రిక విజేతలుగా నిలిచారని తెలిపారు. ఏకపాత్రాభినయంలో కార్వేటినగరం ప్రభుత్వ హైస్కూల్‌కు చెందిన ప్రమోద్‌సాయి విజేతగా నిలిచినట్లు తెలిపారు. బొమ్మల తయారీలో పాదిరికుప్పంకు చెందిన చందు, ఉషశ్రీ విజేతగా నిలిచారని వెల్లడించారు.

Updated Date - 2022-12-07T00:07:22+05:30 IST