అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థికి విద్యుత్‌షాక్‌

ABN , First Publish Date - 2022-03-23T06:27:27+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి విద్యుత్‌షాక్‌కు గురైంది. చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడింది. సంఘటన పెద్దకనపర్తి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం జరిగింది.

అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థికి విద్యుత్‌షాక్‌
విద్యుత్‌ షాక్‌కు గురైన చిన్నారి గౌతమ్‌

- చిన్నపాటి గాయాలతో బయటపడిన చిన్నారి


తొట్టంబేడు, మార్చి 21: అంగన్‌వాడీ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి విద్యుత్‌షాక్‌కు గురైంది. చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడింది.  సంఘటన పెద్దకనపర్తి అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యుల కథనం మేరకు...  రుద్రయ్య, కల్పన దంపతుల కుమారుడు చిన్నారి గౌతమ్‌(3) పెద్ద కనపర్తి గ్రామంలోని అంగన్‌వాడీ  కేంద్రానికి వెళ్లాడు. అంగన్‌వాడీ కేంద్రం బయటకు వచ్చి ఆడుకుంటూ వెనుక వైపున ఉన్న ఓ ఇంటికి తీసిన విద్యుత్‌ తీగల్లో ఒకటి తెగిపోయి వ్రేలాడుతుండగా ఆ తీగను పట్టుకున్నాడు. దీంతో షాక్‌ తగిలి సృహ కోల్పోయాడు. తీగలు తగిలిన చోట వాతలు కూడా పడ్డాయి. దీనిని గమనించిన అంగన్‌వాడి సిబ్బంది మీ అబ్బాయికి ఫిట్స్‌ వచ్చాయి.. ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పి తల్లిదండ్రుల వద్ద వదిలేశారు. వారు హుటాహుటిన శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే చేతులపై బొబ్బలు ఏర్పడటంతో అనుమానం వచ్చిన వారు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి సిబ్బందిని గట్టిగా అడగడంతో జరిగిన విషయం వెలుగుచూసింది.


Read more